అల వైకుంఠ పురంలో.. మ్యూజికల్ జర్నీకి ఏడాది

by Shyam |
అల వైకుంఠ పురంలో.. మ్యూజికల్ జర్నీకి ఏడాది
X

అల వైకుంఠపురంలో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ సాధించి.. తెలుగు ఇండస్ట్రీ నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. సినిమా ఎంత బంపర్ హిట్ అయిందో… మ్యూజిక్ అంతకు మించిన హిట్ అయింది. యుట్యూబ్ రికార్డులను బ్రేక్ చేసింది. ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ కాగా… ఒక్కో పాట ఒక్కో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక బుట్టబొమ్మ సాంగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. సరిహద్దులు దాటింది… విదేశాల్లో కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ టిక్ టాక్ లో వీడియోలు షేర్ చేశారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ మధ్య ఈ పాటకు డ్యాన్స్ చేయగా వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్ థమన్… బిలియన్ వ్యూస్ సాధించే మ్యూజిక్ ఆల్బమ్ ఇస్తా అని ప్రామిస్ చేశావ్.. కానీ అంతకు మించిన రికార్డులు సాధించింది.. థాంక్స్ అంటూ అల వైకుంఠ పురంలో హీరో బన్నీ కూడా థమన్ ను ప్రశంసించాడు.

అయితే ఈ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయి.. ఎగ్జాక్ట్ గా ఏడాది అయింది అంటూ ట్వీట్ చేశాడు ఎస్.ఎస్.థమన్. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, సాహిత్యం అందించిన సీతారామ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. కాగా థమన్ క్రేజీ ప్రాజెక్టులు చేజిక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్, క్రాక్ సినిమాలకు సంగీతం అందిస్తున్న ఆయన.. తొలిసారి ఇళయ దళపతి విజయ్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు.


Tags: SS Thaman, Allu Arjun, Trivikram Srinivas, Seetharama Shastri

Advertisement

Next Story

Most Viewed