- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో హీరోయిన్ ఫ్యామిలీ.. ఈ పరిస్థితి మరెవరికీ రాకూడదు!
దిశ, సినిమా : భారత్ కరోనాతో పోరాడుతోంది. రోజుకు 3.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు ఉండగా, ఇలాంటి పరిస్థితులు రాకుండా తమ వంతు ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చింది యంగ్ బ్యూటీ అవికా గోర్. తన కుటుంబం కరోనాతో పోరాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, ఇలాంటి దుర్భర పరిస్థితులు మరొకరికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ నోట్ షేర్ చేస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ ఒక భయానక పరిస్థితి అని, ఇప్పటికే రెండు లక్షల మంది చనిపోయారని అధికారిక వర్గాలు చెబుతున్నా ఈ సంఖ్య నాలుగు ఐదు రెట్లు ఉండొచ్చని అభిప్రాయపడింది. దేశంలో 17 మిలియన్‌కు పైగా జనాభా కరోనా వైరస్‌తో ప్రభావితం అయ్యారని, హెల్త్ కేర్ సిస్టమ్ ఓవర్ బర్డెన్‌తో ఉందని, ఇప్పుడు ఒకరికి ఒకరం మద్దతు ఇచ్చుకోవడం తప్పితే మరో దారి లేదని సూచించింది.
ఈ క్రమంలో ముందుగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిద్దామని కోరింది అవికా. ఇంతకు ముందు కరోనాతో యుద్ధం చేసి గెలిచిన వారు ప్లాస్మా దానం చేయాలని అభ్యర్థించింది. ఆస్పత్రి యాజమాన్యాలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలిపింది. మన వంతు వచ్చినప్పుడు కచ్చితంగా టీకా వేయించుకుందామని పిలుపునిచ్చిన అవికా, ఈ వ్యాక్సిన్ వైరస్ మళ్లీ రాకుండా రక్షించకపోవచ్చు. కానీ దాని ప్రభావం నుంచి మాత్రం గణనీయంగా కాపాడుతుందని తెలిపింది. తానిక్కడ లెక్చర్లు ఇవ్వడం లేదని, కేవలం ఇది రిక్వెస్ట్ మాత్రమేనన్న హీరోయిన్, కరోనాను ఒకసారి దాదాపు ఓడించాము.. ఈ సారి పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చింది.