- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎస్కే ముందు 176 పరుగులు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఏడవ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పర్వాలేదనిపించింది. తొలి పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ ఆ తర్వాత జోరు పెంచారు. ముఖ్యంగా ఓపెనర్ పృథ్వీ సమయం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదాడు. మొత్తం 43 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ బాది 64 పరుగులు చేసి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.
శిఖర్ ధావన్ కూడా తొలుత నెమ్మదిగా ప్రారంభించిన ఆ తర్వాత బ్యాటింగ్ స్పీడ్ పెంచాడు. 27 బంతులు ఫేస్ చేసిన గబ్బర్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగుల చేసి పర్వాలేదనిపించాడు. సరిగ్గా క్రీజులో కుదురుకుంటున్న సమయంలో స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన బంతికి షాట్ ఆడబోయి lbwతో 94 పరుగుల ఔట్ అయ్యాడు. దీంతో 94 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తరువాత మరో ఓవర్ వేసిన పియూష్ చావ్లా.. పృథ్వీ షా (67)ను 103 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో ఢిల్లీ ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పంత్.. శ్రేయాస్ అయ్యార్ కాసేపు క్రీజులో నిలబడ్డారు..
ఇదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ శామ్ కుర్రాన్ వేసిన బంతిని షాట్ ఆడబోగా.. పొరపాటున బ్యాట్ ఎడ్జ్‌కు తగలడంతో కీపర్‌కు క్యాచ్ వెళ్లింది. అప్రమత్తంగా ఉన్న ధోని అద్భుత క్యాచ్ పట్టాడు. దీంతో శ్రేయాస్ మైదానం నుంచి వెనుదిరిగాడు. అప్పటికే క్రీజులో ఉన్న పంత్ 25 బంతుల్లో ఆరు ఫోర్లు బాది 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. స్రోయినిస్ మూడు బంతుల్లో 5 పరుగులు చేశాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ 175 పరుగులు చేయగలిగింది.
స్కోర్ బోర్డు:
Delhi Capitals: శిఖర్ ధావన్ lbw(B) పీయూశ్ చావ్లా 35(27), పృథ్వీ షా (st) మహేంద్ర సింగ్ ధోని (B) పీయూశ్ చావ్లా 65(43), శ్రేయాస్ అయ్యర్ (C) మహేంద్ర సింగ్ ధోని (B) శామ్ కుర్రాన్ 26 (22) రిషబ్ పంత్ నాటౌట్ 37 (25) , మార్కస్ స్టోయినిస్ నాటౌట్ 5(3).. ఎక్స్‌ట్రాలు 8.. మొత్తం స్కోరు 175/3.
వికెట్ల పతనం: 94/1, 103/2, 161/3
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-38-0, శామ్ కుర్రాన్ 4-0-27-1, జోష్ హాజిల్‌వుడ్ 4-0-28-0, పియూష్ చావ్లా 4-0-33-2, రవీంద్ర జడేజా 4-0-44-0.