- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబును భ్రష్టుపట్టించింది లోకేశే: అవంతి
దిశ, ఏపీ బ్యూరో: చంద్రబాబు, లోకేశ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. చంద్రబాబును భ్రష్టుపట్టించింది లోకేశే అని తీవ్ర విమర్శలు చేశారు. లోకేశ్ నాయకత్వాన్ని టీడీపీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. మంగళవారం విశాఖలో మంత్రి అవంతి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై లోకేశ్ చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అన్ని వనరులున్న విశాఖను గతంలోనే చంద్రబాబు రాజధానిగా ప్రకటించి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవకాశం ఉండేదన్నారు. ఏపీలో అన్నిప్రాంతాలను డెవలప్ చేయాలని మూడు రాజధానులను ప్రకటించామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో విశాఖ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని, అందుకే అవకాశం దొరికితే ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని విమర్శించారు.