- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ మూడింటితో వైజాగ్ అభివృద్ధి’
దిశ ఏపీ బ్యూరో: ఎయిర్ పోర్ట్, మూడు పోర్టులు, రైల్వే జోన్ తో వైజాగ్ ని అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైజాగ్ లోని మధురవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని చెప్పారు. అందులో భాగంగానే 4.5 కోట్ల అభివృద్ది పనులకి శంఖుస్థాపనల చేశామన్నారు. పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు.
గత ఏడాది విశాఖలో 1000 కోట్ల రూపాయలుపైగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో వైజాగ్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని అంచనా వేశారు. విశాఖ 2019 కి ముందు…ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారని ఆయన చెప్పారు.. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్ ఇలా వైజాగ్ అన్ని వసతులు కలిగిన నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.