- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్‌బీఐ నుంచి మరో బంపర్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారుల కోసం మరోసారి భారీ ఆఫర్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఇదివరకు బంగారంపై రుణాలను అందిస్తున్న రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం బంగారం రుణాలపై 7.5 శాతం వడ్డీ రేటు ఉందని, తక్కువ వడ్డీ రేట్లతోనే ఎస్‌బీఐ బంగారు రుణాలను అందిస్తున్నట్టు పేర్కొంది.
ఇదివరకు రూ. 20 లక్షల వరకు బంగారంపై రుణాలను తీసుకునే వీలుండేదని, దీన్ని ఇప్పుడు రెట్టింపు చేస్తూ రూ. 50 లక్షల వరకు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. బంగారంపై కనిష్ట రుణం రూ. 20 వేలుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా డాక్యుమెంట్ ప్రక్రియ కూడా తక్కువగా ఉంటుదని, బంగారు నాణేలతొ పాటు బంగారు ఆభరణాలపై ఎస్‌బీఐ రుణాలను తీసుకోవచ్చని తెలిపింది. అలాగే, ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదని, 18 ఏళ్లు వయసు దాటిని బంగారంపై రుణాలను తీసుకునేందుకు అర్హులని పేర్కొంది.