Citroen Aircross Explorer: రూ.10.23 లక్షల ధరలో భారత మార్కెట్లో కొత్త కారును లాంచ్ చేసిన సిట్రోయెన్

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-06 11:14:22.0  )
Citroen Aircross Explorer: రూ.10.23 లక్షల ధరలో భారత మార్కెట్లో కొత్త కారును లాంచ్ చేసిన సిట్రోయెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్(France)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్(Citroen) కొత్త మోడల్ కారును భారత మార్కెట్లో(Indian Market) విడుదల చేసింది. ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్(Aircross Explorer) పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఈ కారు ఎడిషన్ ప్లస్(Edition Plus), మ్యాక్స్(Max) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధరను రూ.10.23 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అలాగే వేరియంట్‌ను బట్టి ధర రూ.14.79 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అయితే ఈ కార్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. సేఫ్టీ కోసం ఇందులో డాష్ కెమెరా, ఫుట్ వెల్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు, హుడ్ గార్నిష్ వంటివి ఉన్నాయి. అలాగే కార్ లోపలి భాగం బాడీ డీకాల్స్, ఖాకీ కలర్ ఇన్ సర్ట్ లతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలాగే లోపల బ్యాక్ సైడ్ సీట్లలో ఎంటర్ టైన్ మెంట్ కోసం డిస్ప్లే కూడా ఉంటుంది. ఈ కారు 1.2 లీటర్ కలిగిన త్రీ సిలిండర్ ఇంజిన్స్ ను అమర్చారు. పవర్ ట్రెయిన్ వెర్షన్ గరిష్టంగా 82 హార్స్ పవర్, 115 Nm ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక టర్బో వెర్షన్ 110 హార్స్ పవర్, 190 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సులు దీనిలో ఉన్నాయి.

Advertisement

Next Story