- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు జీతాలు పెంచనున్న ఆటో కంపెనీలు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సంవత్సరం అన్ని రంగాలు కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగుల వేతనాలను నిలిపేశాయి. ఓ వైపు నష్టాలు, మరోవైపు కార్యకలాపాల కొనసాగింపు కష్టమైపోవడంతో వేతన పెంపు కంపెనీలకు ఇబ్బందిగా మారిపోయింది. ఈ క్రమంలో అన్‌లాక్ ప్రారంభమైన తర్వాత దేశీయ ఆటో పరిశ్రమ అన్ని రంగాల కంటే వేగంగా కోలుకుంది. ఇటీవల ఆటో విక్రయాలు వేగంగా పుంజుకోవడంతో కంపెనీలు ఉద్యోగులకు జీతాలను పెంచాలని నిర్ణయించాయి.
గడిచిన మూడు నెలలుగా ఆటో విక్రయాలు పెరగడంతో మారుతీ సుజుకి, టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్, హ్యూండాయ్, కియా మోటార్స్, హీరో మోటోకార్ప్ సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలను పెంచాలని చూస్తున్నాయి. వీటితో పాటు దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా డిసెంబర్ నుంచి జీతాలు పెంచేందుకు సిద్ధమైంది. మాములుగా ఆటో పరిశ్రమలు ఆగష్టు నెలలో జీతాలను పెంచుతాయి. అయితే, ఈ ఏడాది కొవిడ్-19 కారణంగా జీతాల పెంపును ఆలస్యం చేశాయి. ఇటీవల విక్రయాలు మెరుగుపడటంతో, రానున్న కొంతకాలం పాటు ఇదే స్థాయిలో డిమాండ్, విక్రయాలు ఉంటాయని భావించిన ఆటో కంపెనీలు ఉద్యోగాలను పెంచడమే కాకుండా ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని భావిస్తున్నాయి.