- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎట్టకేలకు కాప్రా కస్టోడియన్ భూములు స్వాధీనం
దిశ, జవహర్ నగర్: ఎన్నో ఏళ్లుగా వివాదాల నిలయంగా మారిన కాప్రా కస్టోడియన్ భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు తావులేకుండా ఉక్కు పాదం మోపారు. గురువారం తెల్లవారు జామున భారీగా మొహరించిన పోలీసులు బందోబస్తు మధ్యన కబ్జాకు గురైన వంద కోట్ల ప్రభుత్వ భూమి సర్వే నెం 152 విస్తీర్ణం 13.17 ఎకరాలలో ఎట్టకేలకు అక్రమ ఫెన్సింగ్ తొలగించారు. సుమారు వేయి కోట్ల విలువైన 70 ఎకరాల భూముల్లో ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు. ఘటన స్థలం వద్ద ఇన్ చార్జ్ ఆర్డీవో మల్లయ్య, ఏసీపీ శివకుమార్ పర్యవేక్షణలో కాప్రా మండల తహాసీల్దార్ గౌతమ్ కుమార్ తన సిబ్బందితో కాప్రా కస్టోడియన్ భూములను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమార్కులు బరితెగించి కుట్ర పూరితంగానే గతంలో తహసీల్దార్ గౌతమ్ కుమార్‌పై ఉల్టా కేసు పెట్టడంతో పాటూ, వివాదంలోకి ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని లాగడంతో రాజకీయ రంగు పూయడం దారుణమని తహసీల్దార్ కే. గౌతమ్ కుమార్ పేర్కొన్నారు. భూకబ్జాదారులపై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ యంత్రాంగంతో పట్టు బిగించామని తెలిపారు. తహసీల్దార్ గౌతమ్ కుమార్, సీఐ బిక్షపతి రావు ఆధ్వర్యంలో పలు అక్రమ నిర్మాణాల తొలగింపు చేశామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టడంతో తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న దుండగులను క్షమించేది లేదన్నారు. ఇదిలా ఉండగా.. కోట్ల విలువైన ఎవాక్యూ భూములను ప్రజావసరాలకు కేటాయించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.