ఉప్పొంగిన వాగు.. రహదారి మూసేసిన అధికారులు

by Sridhar Babu |
ఉప్పొంగిన వాగు.. రహదారి మూసేసిన అధికారులు
X

దిశ, పాలేరు: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ముదిగొండ మండలంలోని చిరుమర్రి, వనం వారి కృష్టాపురం గ్రామాల మధ్యలో ఉన్న వాగు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నది. దీనితో గురువారం రాత్రి అధికారులు రహదారిని మూసివేశారు. ఖమ్మం, వల్లభి వెళ్లాల్సిన వాహనదారులను దారి మళ్లిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా వనం వారి కృష్ణా పురం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను ఆపివేశారు. ఈ పరిస్థితులను స్వయంగా ముదిగొండ తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఎస్సై నరేష్, ట్రైని ఎస్సై సురేష్, ఎంపీడీవో శ్రీనివాసరావు సమీక్షించారు. వాగు దాటేందుకు ఎవరు ప్రయత్నించవద్దని సూచించారు. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed