- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం.. గ్రూప్ 1లో సెమీస్ వెళ్లేదెవరు..?
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ ఓపెనర్లు చెలరేగారు. 16.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించారు.
ఆస్ట్రేలియాలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆరోన్‌ఫించ్ (9) నిరాశ పరిచాడు. ఇక వన్‌డౌన్ బ్యాట్స్‌మాన్ మిచేల్ మార్ష్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఇక గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చినా బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు. ఈ క్రమంలో రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 161 పరుగులు బాది వెస్టిండీస్‌పై విజయం సాధించింది.
దీంతో సూపర్ 12 గ్రూప్ 1లో నాలుగు మ్యాచుల్లో గెలిచిన ఆసీస్ సెమీస్ రేసులో ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్తు కాన్ఫామ్ చేసుకోగా.. కాసేపట్లో జరగనున్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌తో ఏ జట్టు రెండో సెమీస్ బెర్తును దక్కించుకుంటుందో అనేది ఆధారపడి ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది.