Aus Vs Eng : చేతులెత్తేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. యాషెస్ సిరీస్‌ ఆస్ట్రేలియా కైవసం

by Anukaran |
Aus Vs Eng : చేతులెత్తేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. యాషెస్ సిరీస్‌ ఆస్ట్రేలియా కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్‌ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ అరంగేట్ర పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ 6/7 సంచలన ప్రదర్శనతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. 31/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మరో 37 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.

Advertisement

Next Story