- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళకు ఆ రకమైన ఫొటోలు పంపిన ఆసీస్ కెప్టెన్.. చివరకు రాజీనామా
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ ‘సెక్ట్సింగ్’ వివాదంలో చిక్కుకున్నాడు. సహచర మహిళా ఉద్యోగికి అసభ్యకరమైన మెసేజీలు చేసినట్లు తేలడంతో అతడు వెంటనే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 2017లో క్రికెట్ ఆస్ట్రేలియాలో పని చేసే ఒక మహిళా ఉద్యోగికి టిమ్ పైన్ అసభ్యకర రీతిలో ఉన్న తన ఫొటోతో సహా పలు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపాడు. దీనిపై సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టి నిజమేనని తేల్చింది.
ఈ నేపథ్యంలోనే టిమ్ పైన్ తాను రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపాడు. తాను ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా ఉండటానికి అనర్హుడినని అతడు పేర్కొన్నాడు. తన నిర్ణయం జట్టుతో పాటు తన కుటుంబానికి కూడా మంచిదే అని పైన్ అన్నాడు. కీలకమైన యాషెస్ సిరీస్ వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నది. దానికి ముందు పైన్ రాజీనామా చేయడంతో ఆసీస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. పైన్ స్థానంలో పాట్ కమిన్స్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నది. 2018లో బాల్ టాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దీంతో టిమ్ పైన్‌కు కెప్టెన్సీ అవకాశం వచ్చింది.