- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డే/నైట్ టెస్టులో పటిష్టంగా ఆస్ట్రేలియా
దిశ, స్పోర్ట్స్: యాషెస్ సిరీస్ 2021లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు గురువారం అడిలైడ్‌లో ప్రారంభమైంది. ఈ డే/నైట్ టెస్టుకు గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్, పేసర్ జోష్ హాజెల్‌వుడ్ గాయం కారణంగా దూరమయ్యారు. దీంతో స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ మార్కస్ హారిస్‌ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్ చేర్చాడు. జాస్ బట్లర్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడంతో హారిస్ వెనుదిరగక తప్పలేదు. అప్పటికి ఆసీస్ స్కోర్ 4 పరుగులు మాత్రమే.
అయితే ఆ తర్వాత మార్నల్ లబుషేన్, డేవిడ్ వార్నర్ నిలకడగా ఆడారు. ఇద్దరూ అసలైన టెస్టును మ్యాచ్‌ను చూపించారు. ఇంగ్లాండ్ బౌలర్లు విరుసుతున్న నిప్పులు చెరిగే బంతులను ఆచితూచి ఆడారు. పూర్తిగా డిఫెన్స్ ఆడుతూ.. అడపాదడపా పరుగులు రాబట్టారు. దీంతో తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా 45/1 స్కోర్ మాత్రమే చేసింది. 25 ఓవర్లలో కేవలం 45 పరుగులే చేశారంటే ఆసీస్ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.
డేవిడ్ వార్నర్, లబుషేన్‌లు అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పరుగుల వేగం పెంచారు. రెండో సెషన్‌లో కాస్త వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో టీ విరామం సమయానికి 129/1 స్కోర్ చేసింది. అయితే మూడో సెషన్ ప్రారంభమైన తర్వాత ధాటిగా ఆడిన వార్నర్.. సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం. ఆ తర్వాత లబుషేన్, స్టీవ్ స్మిత్ మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 221/2 స్కోర్ చేసింది. మార్నల్ లబుషేన్ (95), స్టీవ్ స్మిత్ (18) బ్యాటింగ్ చేస్తున్నారు.