- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడి ఇండియా ఆన్‌లైన్ బుకింగ్ సర్వీసులు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి ఆటోమొబైల్ రంగం భారీ నష్టాలతో పాటు ఆటో ఇండస్ట్రీ కార్యకలపాలనే మార్చేసింది. సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో పరిశ్రమ పనులు ప్రారంభించింది. లాక్‌డౌన్ సడలింపులతో తాజాగా ఆడి ఇండియా సైతం కార్యకలాపాలను మొదలుపెట్టింది. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఆటో కంపెనీలు డిజిటల్ కార్యకలాపాలను మొదలుపెడుతున్నాయి. వినియోగదారులతో నేరుగా ఇంటరాక్ట్ అవకుండా అవసరమైన జాగ్రత్తలను పాటిస్తున్నాయి. ఆన్‌లైన్ సేల్స్, సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆడి ఇండియా దీనికి సంబంధించి ఆన్‌లైన్ సేల్స్‌ను మొదలుపెట్టింది. కొత్తగా వచ్చే కస్టమర్లకు తక్షణమే ఆన్‌లైన్‌లో వాహనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం సర్వీసులను డోర్ స్టెప్ పిక్-అప్, డ్రాప్‌లను సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.