- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటెండెంట్లకు ఎంత కష్టమొచ్చే.. రోడ్లపైనే నిద్రాహారాలు!
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ ఆసుపత్రి గేటు ఎదుట కరోనా పేషెంట్లకు చెందిన అటెండెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆసుపత్రిలో ఉన్న తమ వారి యోగక్షేమాలు తెలియక అరిగోస పడుతున్నారు. 24 గంటల పాటు రోడ్లపైనే నిద్రాహారాలు చేస్తూ నిత్యం నరకం అనుభవిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలోకి కరోనా పేషెంట్ల అటెండెంట్లను అనుమతించక పోవడంతో రెండు రోజుల నుంచి గేటు బయటనే తమ కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రి వార్డుల్లో తమ వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలసుకునేందుకు కనిపించిన ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్ నుంచి సరైన సమాచారం తెలియకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
ఆసుపత్రి సిబ్బంది నుంచి పిలుపు వస్తే ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుదోనని భయపడిపోతున్నారు. చికిత్సలు పొందుతున్న తమ వారిని రోజుకు ఒక్కసారైనా చూసుకునేందుకు అనుమతించాలని అధికారులను వేడుకున్నప్పటికీ సిబ్బంది కనికరించడం లేదని అటెండెంట్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆసుపత్రి బయటి ప్రాంగణంలో ఎలాంటి సదుపాయం లేకపోవడంతో తీవ్రమైన ఎండలో నిరీక్షణలు చేసి పేషెంట్ల అటెండెంట్లు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో చాలా మంది అటెండెట్లు కరోనా సోకి చనిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలిపారు. వీటికి తోడు ఆసుపత్రి వార్డుల్లో పర్యటించిన అటెండెంట్లు బయటకు వెళ్లి కరోనా వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నారని వివరించారు. అటెండెంట్ల క్షేమం కోరి ఆసుపత్రిలోకి అనుమతించడం లేదని స్పష్టం చేశారు.