- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి బ్యాంకులో చోరి యత్నం.. లాకర్ పగలగొట్టి
దిశ, ముధోల్ : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇద్దరు చోదకులు చోరికి యత్నం చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా తానూరు మండల బెల్ తరోడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. తరోడ గ్రామంలో బ్యాంకు గేటు, షెటర్ తాళాలు పగలగొట్టుకొని బ్యాంకు లోపలకు వెళ్లి బ్యాంకు లాకర్ బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఎంతకీ లాకర్‌లు తెరుచుకోకపోవడంతో చోరీ యత్నం విఫలమయ్యింది. లాకర్ తలుపులు తేరవకపోవడంతో డబ్బులు గల్లంతు కాలేదు. శనివారం ఉదయం ఇది గమనించిన గ్రామీణులు, బ్యాంక్ సిబ్బంది , పోలీస్‌లకు తెలపడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు డాగ్స్ స్కాడ్ ను పిలిపించి దొంగలను కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డాగ్స్ ఊరిలో గల ఓ పాఠశాల వరకి వెళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చాయి. ఇదే విషయంపై బైంసా ఏఎస్‌పీ కిరణ్ కారే మాట్లాడుతూ.. నిందితులు బ్యాంకు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యారని, వాళ్ళ ముఖాలకి మాస్కులు, తొడుగులు వున్నాయని, ఆ సీసీ పుటేజ్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి వాళ్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.