ఒకవైపు పాలాభిషేకాలు… మరోవైపు అరాచకాలు

by Shamantha N |
ఒకవైపు పాలాభిషేకాలు… మరోవైపు అరాచకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్‌లో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ వీడియోను టీడీపీ నేత నారా లోకేష్ పోస్టు చేశారు. వివరాళ్లోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన ఓ యువతి ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతోంది. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఉక్రెయిన్‌ ఆ యువతి నేరుగా శంషాబాద్‌కు వచ్చింది. అక్కడే ఓ హోటల్‌లో ఉండగా, ఆమెపై ప్రవీణ్, సురేందర్ కుమార్, విజయ్‌ కుమార్ అనే ముగ్గురు యువకులు అత్యాచారయత్నం చేశారని అందులో ఉంది.

ఆ యువకులు సీఎం జగన్ మద్దతుదారులని పేర్కొంటూ ఉన్న వీడియోను లోకేశ్ పోస్ట్ చేశారు. ‌

‘కార్య‌రూపం దాల్చ‌ని దిశ‌చ‌ట్టం తెచ్చారంటూ ఒకవైపు పాలాభిషేకాలు.. మరోవైపు కామంతో క‌ళ్లు మూసుకుపోయిన నాయకులు.. కార్య‌క‌ర్త‌లేమో మ‌ర్డ‌ర్లు, మాన‌భంగాలు, అరాచ‌కాల‌కు పాల్ప‌డ‌టం మ‌రోవైపు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వైకాపా వారసులపై చర్యలెక్కడ జగన్ గారు?’ అని లోకేశ్ ప్రశ్నించారు. నిందితుల్లో ఒకరు గతంలో జగన్‌తో కలిసి క్లోజ్‌గా దిగిన ఫొటో ఒకటి లోకేశ్ చేసిన పోస్టులో ఉంది. కాగా దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story