దుప్పిపై ఊర కుక్కల దాడి.. రక్షించడానికి వెళ్లిన యువకుడిని…

by Shyam |
దుప్పిపై ఊర కుక్కల దాడి.. రక్షించడానికి వెళ్లిన యువకుడిని…
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో అడవి నుండి తాగునీటి కోసం చుక్కల దుప్పి గ్రామంలోకి వచ్చింది. దుప్పిని చూసిన ఊరు కుక్కలు దాడి చేస్తున్న సమయంలో దుప్పిని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు వడ్త్యవత్ గణేష్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది దుప్పిని రక్షించి అడవిలో వదిలి పెట్టారు.

అయితే ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాయపడ్డ వన్యప్రాణులకు వైద్యపరంగా ఫారెస్ట్ బేస్ క్యాంప్‌ల దగ్గర ఎలాంటి మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదని, వారి నిర్లక్ష్యం వల్లనే గాయపడ్డ వన్యప్రాణులు వైద్యం అందక మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని జంతు ప్రేమికులు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed