కర్నూలు స్టేట్ కొవిడ్ ఆస్పత్రిలో దారుణం

by srinivas |
కర్నూలు స్టేట్ కొవిడ్ ఆస్పత్రిలో దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొవిడ్ ఆస్పత్రుల తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తమను పట్టించుకోవడం లేదంటూ ఏకంగా బాధితులే సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలను మరువక ముందే కర్నూలు స్టేట్ కొవిడ్ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగు చూసింది.

కర్నూలు జిల్లా గోసపాడు మండలం నెహ్రు నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే, బాధితురాలిని స్టేట్ కొవిడ్ ఆస్పత్రికి తీసుకొచ్చిన అంబులెన్స్ సిబ్బంది.. ఆస్పత్రిలో అడ్మిట్ చేయకుండా బయటన వదిలేసి వేళ్లారు. ఇదే సమయంలో వర్షం కూడా పడుతున్నా.. పట్టించుకోకుండా నిర్దాక్షన్యంగా అలాగే నేలపై వదిలేశారు.

కాసేపటి బంధువులు వచ్చి చూసేసరికి వృద్ధురాలు నేలపైనే నిస్సహాయస్థితిలో పడి ఉంది. దీంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆందోళన చేపట్టారు. వెంటనే బాధితురాలిని స్ట్రెచర్ సాయంతో సుశ్రత భవన్‌లోని బెడ్‌పైకి చేర్చారు. అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed