దశలవారీగా క్రీడా శిబిరాలు: కిరణ్ రిజిజు

by Shyam |   ( Updated:2020-05-10 21:42:13.0  )
దశలవారీగా క్రీడా శిబిరాలు: కిరణ్ రిజిజు
X

దేశవ్యాప్తంగా క్రీడాకారుల శిక్షణ శిబిరాలను దశల వారీగా తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర క్రీడల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి వెయిట్ లిఫ్టర్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంగళవారం నుంచి ట్రాక్ అండ్ ఫీల్డు అథ్లెట్లకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అథ్లెట్లను కలిసి మాట్లాడారు.

Advertisement

Next Story