- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుషులే కోరుకుంటారు మహిళలు అలా ఉండాలని .. బాడీ షేమింగ్‌పై నటి
దిశ, సినిమా: బాలీవుడ్‌లో నటి అతియా శెట్టి గతంలో బాడీ షేమింగ్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఇలీవల ఓ ఇంటర్వ్యూలో తన శరీరంపై వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌ను అంగీకరిస్తున్నానని, కానీ మునుపటితో పోలిస్తే ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నానని తెలిపింది. అలాగే చిన్ననాటి నుంచి ఈ సమస్యను ఎదుర్కొన్నానని చెప్పిన నటి.. ‘నా చిన్నతనంలోనే బాడీ షేమింగ్ కేటగిరీలోకి పడిపోయాను. బాడీ షేమింగ్ అనేది అధిక బరువుతో మాత్రమే కాకుండా సన్నగా ఉండడంతో కూడా ముడిపడి ఉంటుందని ప్రజలు గ్రహించాలి. ఇతరుల బరువు, అందంతో బాడీ పార్ట్‌లతో పోల్చుతూ ఇబ్బందిపెట్టే అనుచితమైన వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. సమాజంలో అందరూ ఒకే విధంగా కనిపించాలని కోరుకోవడం సరైనది కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఎవరూ పరిపూర్ణం కాదు’ అని చెప్పింది. అంతేకాదు ఈ సమాజంలో పురుషులే స్త్రీల శరీర భాగాలపై వివిధ రకాలుగా మాట్లాడుతారని, కానీ మహిళలు మాత్రం పురుషులందరూ కండలు తిరిగి ఉండాలని కోరుకోరని చెప్పింది.