- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha & Naga chaitanya : విడిపోతారని నేను మూడేళ్ల క్రితమే చెప్పాను'
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ లవ్ కపుల్ సామ్- చై విడాకుల వివాదంపై సినీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గత నెల రోజులుగా ఈ వ్యవహారంపై పలు కథనాలు వస్తున్నప్పటికి వాటిపై అక్కినేని ఫ్యామిలీ స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. పెళ్లి రోజే.. దీనిపై క్లారిటీ ఇచ్చే ఆలోచన ఉందన్న ఊహాగానాల మధ్య మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నాలుగేళ్ల క్రితం నాటిదే అయినా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వీడియో ఏంటంటే.. చైతన్య- సమంత ఎక్కువ కాలం కలిసిఉండలేరని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో. ఇక ఈ వీడియోను ఇప్పుడు చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
అస్ట్రాలజిస్ట్ వేణు స్వామి అంటే తెలియని వారుండరు. జరిగే వాటిని ముందే పసిగట్టి చెప్పగల జ్యోతిష్యులు. ఆయన చెప్పిన వాటిలో దాదాపు చాలా వరకూ జరిగాయి. అయితే, సమంత నాగచైతన్యల వివాహం జరగకముందు ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు అచ్చం అలానే జరుతున్నాయి అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఆయన మాట్లాడిన వీడియోలో " నాగచైతన్య, సమంత మ్యారేజ్ చేసుకున్నాక సమస్యలు వస్తాయి. వారికి సంతానం లేకపోవడం, ఇతర సమస్యలు రావడం, గ్యాప్ రావడం, కుటుంబ పరమైన ఇబ్బందులు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సమంత అమావాస్య రోజున పుట్టింది. ఇద్దరి జాతకాలను విశ్లేషించి చెబుతున్నా.. వారికి సినిమా పరంగా అద్భుత అవకాశం ఉంది. పెళ్లి అయ్యాక కూడా సమంతా సినిమాలు చేస్తుంది. కొన్ని క్లాషెస్ వచ్చి ఇద్దరు విడిపోయే అవకాశం ఉంది" అని చెప్పారు. దీంతో ఆయన చెప్పినట్టే జరుగుతున్నదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలా కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలపై ఇప్పుడైనా నాగ్ ఫ్యామిలీ స్పందిస్తారో చూడాలి.