ప్రజా ప్రతినిధులకు నిషేధాజ్ఞలు

by Shyam |
ప్రజా ప్రతినిధులకు నిషేధాజ్ఞలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కార్యదర్శి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. అసెంబ్లీ ఆవరణలో లేదా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ళలో మీడియా సమావేశాలు వద్దని, ఎన్నికలు ఫలితాలు విడుదలై కోడ్ ముగిసేంతవరకూ ఈ ఆంక్షలు అమలవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌ను అప్పటివరకూ మూసివేస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులతో అనధికారికంగా జరిపే చర్చలు కూడా ఎన్నికల కోడ్ నిబంధనల పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని కూడా నిషేధిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఏవి జరిగినా అది కోడ్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది కాబట్టి తదనుగుణమైన చర్యలు తీసుకోడానికి ఆస్కారం కల్పిస్తుందని, అందువల్ల వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అమలుచేస్తున్న నిబంధనలకు సహకరించాల్సిందిగా ప్రజా ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed