- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోదాడలో అసోం విద్యార్థుల అవస్థలు
by Shyam |
దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతోన్న అసోం విద్యార్థులు తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నారు. చదువు నిమిత్తం జిల్లాకు వచ్చిన 300 మంది అసోం విద్యార్థులు లాక్‌డౌన్ వల్ల ఇక్కడే చిక్కుకుపోయారు. మూడ్రోలుగా కనీసం తినేందుకు తిండి కూడా లేక వీరంతా ఇబ్బందులు పడుతుండటంతో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు విద్యార్థులకు తక్షణమే భోజనం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీఓ ఎల్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో వారికి నిత్యావసర సరుకులు, గ్యాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ అలీ, రెవెన్యూ సిబ్బంది, సీఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
tags : carona, lockdown, assam students struck in kodhada, facing food problems
Advertisement
Next Story