- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముద్దు పెట్టుకోవడం అంత ఈజీ కాదు : తివారి కూతురు

దిశ, సినిమా : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్(శ్రీకాంత్ తివారి) కూతురు ధృతిగా కనిపించిన అశ్లేషా ఠాకూర్.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. కిడ్నాపింగ్ ఎపిసోడ్స్‌లోసూపర్ పర్‌ఫెక్షన్ చూపించిన అశ్లేషా.. ఎట్ ఏ టైమ్ కిసింగ్ సీన్‌లోనూ మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ సీన్ చేస్తున్నప్పుడు చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యానని తెలిపిన అమ్మాయి.. ఇది తనకు కొత్తే అయినా క్యారెక్టర్‌కు మెచ్యూరిటీ యాడ్ చేసేందుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశానని తెలిపింది. కిస్ సీన్ షూట్ చేయడం అంత ఈజీ కాదన్న అశ్లేషా.. నటిగా అది తన పనే కాబట్టి చేసేశానని తెలిపింది. దర్శకులపై పూర్తి భరోసా ఉంచానని, అందుకే స్క్రీన్‌పై ఎలా కనిపిస్తుందోనన్న టెన్షన్ పెట్టుకోలేదని వివరించింది.
ఇక కిడ్నాపింగ్ సీన్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ చాలెంజింగ్‌గా ఉందని.. అందుకే ఆ సీన్ చేసేందుకు భయపడ్డానని తెలిపింది. మరో రోజు చేద్దామని డైరెక్టర్స్‌ను రిక్వెస్ట్ చేయగా.. వారు కూడా సపోర్ట్ చేశారని చెప్పింది. ముందుగా సీన్ చేసినప్పుడు కరెక్ట్‌గా చేశానా లేదా? అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నానని, డైరెక్టర్స్ అప్రిషియేట్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అయ్యానంది. ఇక సోషల్ మీడియాలో తనకు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయన్న ఈ టీనేజ్ గర్ల్.. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది.