ఇంతటితో ఆపేయాలా..? ఉధృతం చేయాలా..?

by Shyam |
ఇంతటితో ఆపేయాలా..? ఉధృతం చేయాలా..?
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలో ఆశా కో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రెండవ రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ.. ఆశా కో పరిశ్రమలో కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 14 రోజులుగా విన్నవించినా చర్చల ద్వారా సమస్య పరిష్కరించకుండా వ్యవహరిస్తూ కార్మికులను బెదిరించే ధోరణిలో వ్యవరిస్తుందన్నారు. చట్టప్రకారం 14 రోజుల ముందు సమ్మె నోటీసు ఇచ్చినా నేటి వరకు పరిష్కారం కాలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేటి నుండి కార్మికులు సమ్మె ప్రారంభించారని ఇప్పటికైనా యాజమాన్యం అక్రమ లే ఆఫ్ ఎత్తి వేయాలని, రెండు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని, కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీసీఎల్ అధికారులు, పోలీస్ అధికారులు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. వెంటనే అక్రమ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. లేనిచో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంది మండల యూనియన్ నాయకులు నువ్ తుల్ల, కృష్ణ, నాగరాజు, ప్రభాకర్, రామ్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్ రావు, నిజాముద్దీన్, బాబురావు, కిష్టయ్య, శౌ రెడ్డి కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story