- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పవన్ ని వెతకమని ఆమె మనుషులను పంపించేవారు'
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రిజర్వడ్ గా ఉంటారని అందరికి తెలిసిందే. అందుకే చిత్ర పరిశ్రమలో ఆయన చాలా తక్కువమందితో స్నేహాన్ని కొనసాగిస్తారు. త్రివిక్రమ్ , ఆలీ, బండ్ల గణేష్ వీరే ఎక్కువగా పవన్ తో కలిసి ప్రయాణం చేస్తున్నవారు. ఇక వీరితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. వారిద్దరూ స్నేహం పవన్ చిన్నప్పటి నుండి కొనసాగుతుంది. ఇక తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పవన్ చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. మా ఇద్దరి మధ్య స్నేహం మరువలేనిదని, ఆయనతో ఉన్న రోజులు మర్చిపోలేనివాని ఆనంద్ సాయి తెలిపారు. పవన్ ఒక పుస్తకాల పురుగన్న ఆనంద్.. ఎప్పుడు పవన్ రూమ్ ని చూసినా ఒక లైబ్రరీ గుర్తొచ్చేదని అన్నారు. అంతేకాకుండా పవన్ ఒక రక్షిత వాతావరణంలో పెరగాడని, ఆ వయస్సులో ఎక్కువ బయట ప్రపంచం గురుంచి అవగాహన లేదని తెలిపారు.
ఇక పవన్ ని వదిన సురేఖ ఒక తల్లిలా చూసుకునేవారని, పవన్ ఒక అరగంట ఇంటికి రాకపోతే అతనిని వెతకడానికి మనుషులను పంపించేవారని తెలిపారు. చిన్నప్పుడు ఎక్కువగా పవన్ ఇంట్లోనే గడిపానని తెలిపిన ఆనంద్ సాయి ‘తొలిప్రేమ’ సినిమాకు తాను వేసిన తాజ్ మహల్ సెట్ చూసి పవన్ మెచ్చుకున్నాడని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరం ఎవరి వ్యక్తిగత పనులలో వారు బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఆయన తనకు ఫోన్ చేసి ఆరా తీస్తూ ఉంటారని చెప్పుకొచ్చారు.