మద్యం కోసం పోలీస్ అవతారం

by Shyam |
మద్యం కోసం పోలీస్ అవతారం
X

దిశ, వరంగల్: మద్యం కోసం వైన్ షాప్ యాజమానులు పోలీస్ అవతారమెత్తారు. తాము మద్యం రవాణా చేస్తున్న కారుకు పోలీస్ స్టిక్కర్ అతికించి అసలు పోలీసులను మోసగించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు నకిలీలపై అనుమానం వచ్చిన ఓ అధికారి కారును తనిఖీ చేయడంతో దొంగ పోలీసుల వ్యవహారం బట్టబయలైంది. ఈ సంఘటన రాత్రి వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది. వరంగల్ అర్భన్ జిల్లా కేంద్రంలోని కరీమాబాద్ కు చెందిన రాజుకుమార్, రవి.. నర్సంపేట పట్టణంలో శ్రీనివాస వైన్స్ నిర్వహిస్తున్నారు. గత నెలలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వైన్స్ మూసేశారు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే దురుద్ధేశంతో ఇద్దరు ఒక ఆలోచన చేశారు. కారుకు పోలీస్ స్టిక్కర్ అంటించి, కారులో పోలీస్ టోపీ ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నర్సంపేట మధ్యలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పోలీస్ అని చెప్పుకుంటూ సోమవారం అర్ధరాత్రి సమయంలో నర్సంపేటకు చేరుకున్నారు. ఎవరూ లేని సమయం చూసి పట్టణంలోని శ్రీనివాస వైన్స్ షాపు తాళం తీశారు. అందులో నుంచి మద్యం బాటిళ్లు తీసి కారులో పెడుతూ సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల కంటపడ్డారు. అనుమానించిన పోలీసులు వైన్స్ వద్దకు వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకుని కారు, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

Tags: Police dress up, wine seized, narsampet, warangal

Advertisement

Next Story

Most Viewed