బ్లాక్ లో బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్ విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు

by Sumithra |
బ్లాక్ లో బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్ విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు
X

దిశ, కాప్రా : బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముగ్గురిని ఏస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈసీఎల్ చౌరస్తాలో బ్లాక్ ఫంగస్ ఒక్కో ఇంజెక్షను రూ.30 వేలకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. పూజారి నవీన్ కుమార్ (25), గ్రందే కిషోర్ (42), దబ్బారెడ్డి వెంకటేష్ (25) బోరబండ, మోతినగర్ ప్రాంతానికి చెందిన వీరు బ్లాక్ లో అమ్ముతుండా ఏస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుల నుంచి మూడు ఇంజెక్షన్లు, మూడు సెల్ ఫోన్లు, హ్యూండాయ్ ఎక్స్ంట్ కారు, 1,460 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story