గుంటూరులో గంజాయి దందా

by srinivas |
గుంటూరులో గంజాయి దందా
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో గంజాయి మాఫియా కొత్త పుంతలు తొక్కుతున్నది. గంజాయి సేవించేవాళ్లు అధికమవ్వడంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరికీ అనుమానం కలుగకుండా డిగ్రీ విద్యార్థుల చేత లిక్విడ్ రూపంలో గంజాయి అమ్మకాలు జరపుతున్నారు. అంతేకాకుండా, కరోనా సమయంలో అత్యవసరమైన శానిటైజర్ డబ్బాల్లో గంజాయి ద్రావణం ఉంచి సరఫరా చేస్తున్న.. 8 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిందితులంతా డిగ్రీ విద్యార్థులు కావడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. వీరి నుంచి 8 కేజీల గంజాయి, 55 గంజాయి లిక్విడ్ బాటిల్స్, రూ. 30 వేల నగదు, 9 సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కాటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story