- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
దిశ, శేరిలింగంపల్లి : క్రికెట్ బెట్టింగ్ నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, బెట్టింగ్ కు పాల్పడినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు. టీ 20 వరల్డ్ కప్ సందర్భంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ను సోమవారం గుట్టు రట్టు చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని టీఎన్జీఓస్ కాలనీలో ఉన్న విహంగ్ హాస్టల్ లో మహారాష్ట్రకు చెందిన ఖాసిమ్ ఉఫర్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహించారని రోజుకు రూ.800 చొప్పున నెల రోజుల పాటు రూమ్ ను అద్దెకు తీసుకుని నిందితులు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన ఆర్గనైజర్ ఖాసిఫ్ ఉమర్ తో పాటు మరో ఇద్దరు మెయిన్ బుకీలు పరారీలో ఉండగా, ఇంకో ఇద్దరు బుకీలు ఓ సబ్ బుకీతో పాటు మరో నలుగురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. లైవ్ లైన్ గురు, క్రికెట్ బజ్, క్రికెట్ మజా యాప్ లతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, ఒకేసారి రెండు వందల మందితో బెట్టింగ్ నిర్వహించేలా ఈ బెట్టింగ్ ముఠా పక్కాగా ప్లాన్ చేసుకుందని తెలిపారు. అలాగే బెట్టింగ్ అమౌంట్ మొత్తం ఆన్ లైన్ లోనే ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో రూ.15 లక్షల నగదు, 11 స్మార్ట్ ఫోన్ లు, ఒక కమ్యూనికేట్ బోర్డు, 3 ల్యాప్‌టాప్ లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ లకు అనువుగా ఉన్న పలు యాప్ లను గూగుల్ స్టోర్ నుంచి తొలగించేలా లేఖ రాస్తామన్నారు. అలాగే క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ పెడతామని పోలీసులు హెచ్చరించారు.