- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారులకు కోవిడ్ చికిత్సల ఏర్పాట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారులను కొవిడ్ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రభుత్వం మందుస్తు ఏర్పాట్లను చేపడుతుంది. పిల్లలకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్సలందించేందుకు నిలోఫోర్ ఆసుపత్రిలో 250 బెడ్లను సిద్ధం చేస్తున్నారు. కాల్సిన సిబ్బందిని, మందులను, ఇంజక్షన్లను ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్రాలో చిన్నారులకు కోవిడ్ సోకుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం రోజుకు 10 మంది చిన్నారులు కోవిడ్ పాజిటీవ్ తో నిలోఫర్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఎలాంటి ఉపద్రవాలు తలెత్తుతే అలాంటి పరిస్థితులే రాష్ట్రంలోనూ ఏర్పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదటగా మహారాష్ట్రలో ప్రభలడంతో సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలో తొలిసారిగా సెకండ్ వేవ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రతో అధికంగా సంబంధాలు ఉండటం, నిత్యంరాకపోకలు జరుగుతుండటంతో అత్యంత వేగంగా కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించింది. తాజాగా మహారాష్ట్రలోని చిన్నారులకు సోకిన కరోన కరోనా ఆందోళన కలిగిస్తుంది. అహ్మద్‌నగర్ జిల్లాలో నెల రోజుల పరిధిలోనే 8వేల మంది చిన్నారులు కరోనా భారిన పడ్డారు. మాల్ న్యూట్రీషియన్ తో బాధపడుతున్న చిన్నారులకే ఎక్కవగా కరోనా సోకినట్టుగా అక్కడి అధికారులు గుర్తించి సరైన చికిత్సలందిస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొవడానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతుంది.
నిలోఫోర్ ఆసుపత్రిలో 250 బెడ్ల ఏర్పాటు
రాష్ట్రంలోని చిన్నారులకు కరోనా సోకితే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతుంది. 500 బెడ్ల కెపాసిటీ ఉన్న నీలోఫోర్ ఆసుపత్రిలో చిన్నారులకు కోవిడ్ చికిత్సలందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 250 అదనపు బెడ్లను ఏర్పాటు చేస్తుంది. చిన్నారులకు చికిత్సలందించేందుకు ఆసుపత్రిలో సరిపడా పిడియాట్రీషియన్లను, నర్సులను, ఇతర సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. చికిత్సలకు అవసరమైన మందులను, ఇంజక్షన్లను సమకూర్చుకునే పనిలో పడ్డారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న గదుల్లో చిన్నారులకు నచ్చే విధంగా ఆసుపత్రి పరిసరాలను రూపుదిద్దుతున్నారు.
రోజుకు 10మంది చిన్నారులకు చికిత్సలు
నిలోఫోర్ ఆసుపత్రిలో ప్రస్తుతం రోజుకు 10మంది చిన్నారులు కరోనా చికిత్సల కోసం వస్తున్నట్టుగా పిడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడి డాక్టర్ రవికుమార్ తెలియజేశారు. వ్యాధి తీవ్రత తక్కవగా ఉండటంతో సరిపడా మందులను అందించి హోం ఐసోలేషన్ లోనే ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. బాలింతలకు కోవిడ్ సోకితే పుట్టిన పిల్లలకు కూడా పాజిటీవ్ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు నీలోఫర్ ఆసుపత్రిలో 60 మంది నవజాత శిశువులకు కరోనా చికిత్సలు విజయవంతంగా అందించామన్నారు. స్టిరాయిడ్ ఉన్న, ఫిడ్స్ ఉన్న, రక్తం తక్కువగా ఉన్న, మాల్ న్యూట్రిషియన్ పిల్లలకు కోవిడ్ వేగంగా సోకుందని చెప్పారు. ప్రస్తుతం నిలోఫోర్ ఆసుపత్రిలో జనరల్ వార్డుల్లో నలుగురికి, ఆక్సిజన్ బెడ్లలో 6 మందికి, ఐసీయూ బెడ్లలో నలుగురు చిన్నారులకు చికిత్సలకు చికిత్సలందిస్తున్నారు.
పిల్లలకు వ్యాక్సినేషన్ పై క్లినికల్ ట్రయల్స్
ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన అందించే ప్రక్రియ ఎక్కడా కూడా ప్రారంభం కాలేదు. యూఎస్, యూకే వంటి దేశాల్లో 12 ఏళ్లు దాటిని పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు పలు క్లినికల్ ట్రయల్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఫైజర్, మోడర్నో వంటి వ్యాక్సిన్లను తయారు చేస్తున్న కొన్ని విదేశీ ఔషద కంపెనీలు పిల్లల్లో వ్యాక్సిన్ చేపట్టేందుకు పలు అధ్యాయనాలు చేపడుతున్నారు.