- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే ఎన్నికల సమరం.. సర్వం సిద్దం చేసిన యంత్రాంగం..
దిశ, మెదక్: మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 10 న మెదక్ శాసన మండలికి జరగనున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు చాలా సునిశితమని, వెబ్ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ముగిసిన వెంటనే తిరిగి రిసెప్షన్ కౌంటర్ కు బ్యాలేట్ బాక్సులు, మెటీరియల్ ఇచ్చే వరకు పూర్తి భాద్యత ఉంటుందని తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి హరీష్ మాట్లాడుతూ.. మెదక్ ఉమ్మడి జిల్లాలో 1,026 మంది ఓటర్లు ఉన్నారని, వీరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంగారెడ్డి లో 4, మెదక్ లో 3, సిద్ధిపేట లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం ప్రతి కేంద్రానికి ఒక సెక్టోరల్ అధికారి, సూక్ష్మ పరిశీలకులతో పాటు నలుగురు పోలింగ్ సిబ్బంది చొప్పున మొత్తం 75 మందిని ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ లో ఓటు వేసేటానికి పోయేటప్పుడు ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల కమీషన్ సూచించిన ఫోటో గుర్తింపు కార్డును తీసుకుని వెళ్లాలని సూచించారు.