- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి జిల్లాలో విషాదం.. పెళ్లైన తొమ్మిది నెలలకే ఆర్మీ జవాన్ మృతి..
దిశ, కామారెడ్డి: తాడ్వాయి మండలం కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ రవీందర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. గత నెల రోజులుగా చండీఘర్ లోని కమాండో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రవీందర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఇంద్ర, భూంరెడ్డిల కుమారుడు రవీందర్ రెడ్డి. గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన రవీందర్ రెడ్డి జమ్మూకాశ్మీర్ లోని సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. రవీందర్ రెడ్డికి తొమ్మిది నెలల క్రితమే ప్రవళికతో వివాహం జరిగింది. మూడు నెలల క్రితం స్వగ్రామమైన తాడ్వాయి మండల కేంద్రానికి వచ్చిన రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. సెలవులు పూర్తి చేసుకుని తిరిగి ఉద్యోగంలో చేరాడు.
గత నెల ఆగస్టు 4న జమ్మూ కాశ్మీర్ లోని సెక్టార్లో విధులు నిర్వహిస్తుండగా రవీందర్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో చండీఘర్ లోని కమాండో ఆసుపత్రికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలించారు. అతనికి మెదడులో సమస్య ఉందని వైద్యులు గుర్తించి ఆపరేషన్ చేశారు. గత నెల రోజులుగా వెంటిలేషన్ పై చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఎన్నో ఆశలతో భర్త తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న భార్య, భర్త మరణవార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
రవీందర్ రెడ్డి ఎనిమిది సంవత్సరాలుగా ఆర్మీలో చేరి దేశానికి ఎంతో సేవ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేశానికి ఇంకా ఎంతో సేవ చేయాల్సి ఉండగానే అతి చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని కుటుంబ సభ్యులు తెలిపారు. నేటి మధ్యాహ్నం రవీందర్ రెడ్డి మృతదేహం స్వగ్రామానికి చేరే అవకాశాలు ఉన్నాయి.