లడఖ్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్ నరవణే..

by Shamantha N |   ( Updated:2020-12-23 09:37:42.0  )
లడఖ్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్ నరవణే..
X

న్యూఢిల్లీ : ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే బుధవారం ఈశాన్య లడాఖ్‌లో పర్యటించారు. భారత్, చైనా మిలిటరీ మధ్య ఏడునెలలుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తరుణంలో ఎల్ఏసీ సరిహద్దులో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. క్షేత్రస్థాయి అంశాలను మిలిటరీ అధికారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్‌తో సంభాషించారు.

రెచిన్‌లాలోనూ పర్యటించారు. తారా బేస్‌కు వెళ్లి లోకల్ కమాండర్లు, ట్రూపులతో మాట్లాడారు. జవాన్లకు స్వీట్లు పంచిపెట్టినట్టు ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. తూర్పు లడాఖ్‌లో ఉభయ దేశాల నుంచి 50 వేల చొప్పున మిలిటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. కాగా, తొమ్మిదో దఫా శాంతి చర్చల కోసం ఇరుదేశాల ప్రతినిధులు కసరత్తులు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed