కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత

by vinod kumar |
Congress leader PC Bhojanna
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ భోజన్న కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. భోజన్న గత 30 ఏండ్లుగా ఆర్మూర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థమైన సేవలు అందించారు. పార్టీలో సీనియర్ నేతగా, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాడు. ఎంపీటీసీగా, కౌన్సిలర్‌గా పనిచేసి అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేగాకుండా.. ఆయన సతీమణి ఉషా ఆర్మూర్ ఎంపీపీగా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. భోజన్న మరణవార్త తెలిసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపారు. కీలక నేతను కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ మనుగడ కోసం భోజన్న చేసిన కృషిని ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

Next Story