ఎమోషన్ అండ్ కామెడీ జర్నీగా ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’

by Jakkula Samataha |
ఎమోషన్ అండ్ కామెడీ జర్నీగా ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’
X

దిశ, సినిమా : అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రూపొందిన బాలీవుడ్ మూవీకి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కాశ్వీ నాయర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపిన మూవీ యూనిట్.. ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అనుజా చౌహన్ కథ అందించిన ఈ చిత్రంలో నీనా గుప్తా ప్రధానపాత్రలో నటించగా.. యూఎస్ నుంచి తిరిగొచ్చిన మనవడు, నానమ్మల మధ్య ఎమోషనల్ డ్రామాగా రాబోతోంది.

నానమ్మ చివరి కోరక తీర్చేందుకు మనవడు ఏం చేశాడనేది కథ కాగా.. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్‌తో పాటు కామెడీ కూడా యాడ్ అయిన సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపారు అర్జున్ కపూర్. ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైమ్ ప్లే చేశానన్న నీనా గుప్తా.. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా అదితి రావు హైదరీ, జాన్ అబ్రహం ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed