ఇద్దరి ఆస్తుల్ని పోల్చడం సిగ్గుచేటు: మలైకా బాయ్‌ఫ్రెండ్

by Shyam |   ( Updated:2021-08-08 03:29:41.0  )
ఇద్దరి ఆస్తుల్ని పోల్చడం సిగ్గుచేటు: మలైకా బాయ్‌ఫ్రెండ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్ ఆస్తులను, తన లేడీ లవ్ మలైకా అరోరా సంపాదనతో పోల్చడం పట్ల ఫైర్ అయ్యాడు. మలైకా లగ్జరీ లైఫ్‌ ఎలా అనుభవిస్తోంది? తనకు అంత డబ్బు ఎలా వస్తుందనే కోణంలో వెలువడిన వార్తలను ఖండిస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టాడు. సదరు న్యూస్ ఆర్టికల్‌లో మలైకా గురించి ప్రస్తావించిన అంశాలను తప్పుపట్టిన అర్జున్.. ఆ తర్వాత పోస్టును డిలీట్ చేశాడు. ఆ పోస్టులో.. “2021లో ఇలాంటి అవివేకమైన హెడ్‌లైన్ చదవడం బాధాకరం, సిగ్గుచేటు. వాస్తవంగా తను బాగా సంపాదిస్తుంది. చాలా ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నందునే ఈ స్థాయిలో ఉంది. దయచేసి నన్ను ఎవరితోనూ పోల్చకుండా ఒంటరిగా వదిలేయండి” అని పోస్టు చేశాడు.

ఇక అర్జున్, మలైకా 2019 నుంచి డేటింగ్‌లో ఉండగా.. 2019లో సోషల్ మీడియా ద్వారా తమ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌ అయ్యారు. ఈ క్రమంలో బర్త్‌డేస్, ప్రత్యేక సందర్భాల్లో ఆన్‌లైన్ పోస్టుల ద్వారా ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేస్తూనే ఉంటారు. అంతేకాదు ఈ రొమాంటిక్ కపుల్ తరచుగా ధర్మశాల, గోవా ఇతరత్రా ప్రదేశాలకు వెకేషన్ కోసం వెళ్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed