- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ లవ్ బర్డ్స్‌కు కరోనా..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గానే చర్చ జరుగుతుంటుంది. వయసు రీత్యా వీళ్లిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉన్నా సరే.. అవేవీ పట్టించుకోకుండా తమ రిలేషన్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఇద్దరికి ఒకేసారి కరోనా పాజిటివ్ రావడం.
తనకు కరోనా పాజిటివ్ అని అర్జున్ కపూర్ ఆదివారం ప్రకటించగా.. సోమవారం ఉదయాన్నే మలైకా అరోరా కూడా తనకు కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనిపై జనాలు ఏదేదో ఊహించేస్తారని గ్రహించిన మలైకా.. దయచేసి ఈ విషయంలో కామ్‌గా ఉండాలని కోరింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నానని.. వైద్యులు, అధికారుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పింది. కానీ ఇంత జరిగాక.. మీమ్స్ రాకుండా ఉంటాయా? సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవకుండా ఉంటాయా? అదే జరిగింది.. మలైకా, అర్జున్ మీమ్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
కాగా, అర్జున్ కపూర్ చాలా రోజుల తర్వాత శుక్రవారం సినిమా షూటింగ్‌కు హాజరుకాగా.. ఆదివారం కరోనా పాజిటివ్ అని కన్‌ఫర్మ్ అయింది. మరో వైపు మలైకా ఓ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తుండగా అందుకు సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంది. దీంతో రెండు చిత్రీకరణలకు సంబంధించిన అందరూ కూడా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.