- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాత తీర్పును గుర్తు చేసిన హైకోర్టు జడ్జీ
దిశ, వెబ్ డెస్క్: పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు రద్దు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, గొవినోళ్ళ శ్రీనివాస్, పాలమూరు రైతులు వేరు వేరు పిటిషన్ల ద్వారా కోర్టును ఆశ్రయించారు.
తాను రాజస్థాన్ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు పంజాబ్- రాజస్థాన్ లో మధ్య జల వివాదం వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లమని సూచించిన విషయాన్ని చీఫ్ జస్టిస్ రాథోడ్ గుర్తు చేశారు. రాజస్తాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వెంటనే కాలువలో నీరు విడుదల చేయాలని ఆదేశించిందని తెలిపారు. దానికి పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ ఆర్టికల్ 226(2) ప్రకారం ఇతర రాష్ట్రాల చర్యల వల్ల హైకోర్టు ఉన్న రాష్ర్టానికి నష్టం వాటిల్లితే హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం ఉందని వివరించారు. పునర్విభజన చట్టంలోని అంశాలను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని తాము కోరుతున్నామని వివరించారు. దీనికి స్పందించిన ప్రధాన న్యాయమూర్తి.. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ద్వారా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై పిటిషనర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు కేసును రేపటికి వాయిదా వేశారు.