అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం….

by Shyam |
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం….
X

దిశ, వెబ్ డెస్క్:
మల్కాజిగిరిలో మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేస్తామని ఆయన చెప్పారు. మల్కాజిగిరిలో నాలాలపై సుమారు 400 అక్రమ కట్టడాలు ఉన్నాయని తెలిపారు. మల్కాజిగిరి వాసులు సహకరిస్తే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ఆయన వెల్లడించారు. ఎవరైనా అడ్డం వస్తే ప్రభుత్వానికి ముంపు బాధితులు అండగా ఉండాలని ఆయన కోరారు.

Advertisement

Next Story