- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలుగుబంట్లు కనుమరుగవుతాయంట…!
దిశ, ఫీచర్స్: ఆర్కిటిక్‌లో ‘సమ్మర్ ఐస్’ కుంచించుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దానిపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న జీవజాతుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనిపై ఎన్నో పరిశోధనలు హెచ్చరించాయి. కానీ, తాజాగా ఓ అధ్యయనం రాబోయే విపత్తుకు టైమ్‌లైన్ పెట్టడం గమనార్హం. ప్రస్తుత స్థాయిలో కార్భన్ ఉద్గారాలు కొనసాగితే, వేసవి మంచు 2100 నాటికి అదృశ్యమవుతుందని, దానితో పాటు సీల్స్ ధ్రువపు ఎలుగుబంట్లు వంటి జీవులు కూడా కనుమరుగవుతాయని ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం పేర్కొంది.
శీతాకాలంలో ఆర్కిటిక్ మహాసముద్ర ఉపరితలం చాలా వరకు ఫ్రీజ్ అయిపోతుంది. వాతావరణం వేడెక్కినప్పటికీ, భవిష్యత్తులో ఇది కొనసాగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే అదే వేసవికాలంలో ఉష్ణతాపం వల్ల కొంత మంచు కరిగినప్పుడు, గాలులు, ప్రవాహాలు దాన్ని చాలా దూరం తీసుకువెళతాయి. వాటిలో కొన్ని ఉత్తర అట్లాంటిక్‌లోకి, గ్రీన్ ల్యాండ్, కెనడియన్ దీవుల్లోకి ప్రయాణిస్తున్నాయి. దీని వలన గొప్ప సముద్ర పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆర్కిటిక్ మంచు మీద ఆల్గే ఉంటుంది. ఇది చిన్న జంతువులకు, చేపలకు ఆహారం కాగా, ఆ చేపలేమో ఎగువన ఉన్న ధ్రువ ఎలుగుబంట్లకు ఆహారంగా మారతాయి. కానీ, వేడెక్కుతున్న వాతావరణంతో వేసవి సముద్రపు మంచు వేగంగా కుంచించుకుపోతోంది. దీంతో 1980ల ప్రారంభంలో ఉన్న విస్తీర్ణంతో పోల్చితే అందులో సగం కంటే తక్కువకే ఇది పరిమితమైంది.
గ్రీన్‌లాండ్‌కు ఉత్తరాన 1 మిలియన్-చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని, కెనడియన్ ద్వీప సమూహం తీరాలను ఈ అధ్యయనం పరిశీలించింది. ఇక్కడ సముద్రపు మంచు ఏడాది పొడవునా దట్టంగా ఉండటంతో అత్యంత స్థితిస్థాపకంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్భన్ ఉద్గారాలకు చెక్ పెడితే భవిష్యత్తులో ఈ ప్రదేశం ఎలా ఉంటుంది. ఒకవేళ కార్భన్ ఎమిషన్స్ అలాగే కొనసాగితే ఎలా ఉంటుందనే దృగ్విషయాన్ని పరిశోధకులు పరిశీలించారు. ఈ మేరకు కార్భన్ ఉద్గారాలు అలాగే కొనసాగితే వేసవి మంచు శతాబ్దం చివరి నాటికి అదృశ్యమవుతుందని తేల్చారు. తక్కువ ఉద్గారాల సందర్భంలోనూ సెంట్రల్ ఆర్కిటిక్ మంచు 2050 వరకు చాలావరకు తగ్గుతుందని, ఇకపై సంవత్సరం పాటు ఉండదని తెలిపారు. తక్కువ ఉద్గారాల సందర్భంలో కనీసం కొన్ని సీల్స్, ఎలుగుబంట్లు, ఇతర జీవులు మనుగడ సాగించవచ్చని అంచనా వేశారు. ఈ జాతులు ప్రస్తుతం పశ్చిమ అలాస్కా, హడ్సన్ బేలోని కొన్ని వేసవి పరిస్థితుల్లో జీవిస్తున్నాయి. అయితే అధిక ఉద్గారాల దృష్ట్యా 2100 నాటికి స్థానికంగా ఏర్పడిన మంచు కూడా వేసవిలో అదృశ్యమవుతుందని అధ్యయనం పేర్కొంది. ఎక్కడా వేసవి మంచు లేకుండా మంచు-ఆధారిత పర్యావరణ వ్యవస్థలు ఉండవని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
‘మేము చేస్తున్న భారీ ప్రయోగం ఇది. ఏడాది పొడవునా మంచు కరిగి పోయినట్లయితే మొత్తం మంచు-ఆధారిత పర్యావరణ వ్యవస్థలు కూలిపోతాయి. దీంతో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఇది అన్ని జీవజాతుల ముగింపుగా భావించవద్దు. కానీ, కొత్త విషయాలు బయటపడతాయి. మరిన్ని కొత్త జీవులు ఆక్రమించడానికి కొంత సమయం పట్టవచ్చు. చేపలు, ఆల్గే మొదలైనవి ఉత్తర అట్లాంటిక్ నుంచి ఇటువైపుగా కొట్టుకు రావచ్చు. కానీ, అవి ఏడాది పొడవునా అక్కడ జీవించగలవా అనేది స్పష్టంగా తెలీదు. ఇది వెచ్చగా ఉండవచ్చు కానీ,.. సూర్యుడి చుట్టూ గ్రహ భ్రమణం మాత్రం మారదు. కావున కొత్త నివాసితులు సుదీర్ఘమైన, సూర్యరశ్మి లేని ఆర్కిటిక్ శీతాకాలంతో జీవించాల్సి ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యమో వేచి చూడాలి.
– రాబర్ట్ న్యూటన్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, కొలంబియా యూనివర్శిటీ