- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పర్యటన నుంచి కేజ్రీవాల్‌ను తప్పించారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్.. మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్లో నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను తప్పించినట్టు సమాచారం. తొలుత వీరిరువురూ ఈ షెడ్యూల్లో ఉన్నట్టు తెలిసింది. తాజాగా, మెలానియా ట్రంప్ పర్యటన నుంచి కేజ్రీవాల్, సిసోడియాలను తప్పించినట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. మెలానియా ట్రంప్ పర్యటన నుంచి దూరంగా ఉండాల్సిందిగా అమెరికా అధికారులు విజ్ఞప్తి చేసినట్టు తెలిపాయి. దీని వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని ఆరోపించాయి. కాగా, ఓ బీజేపీ నేత.. ఆప్ ఆరోపణలను కొట్టిపారేశారు.
ట్రంప్ దంపతులు సోమవారం భారత్ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న హ్యాపినెస్ క్లాస్‌లను మెలానియా ట్రంప్ పరిశీలించనున్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు ఢిల్లీ పాఠశాలల కర్రికులంలో రెండేళ్ల క్రితం మనీష్ సిసోడియానే హ్యాపినెస్ క్లాస్‌లను ప్రవేశపెట్టడం గమనార్హం.