మేయర్ ఎన్నికకు పరిశీలకుల నియామకం

by Sampath |
మేయర్ ఎన్నికకు పరిశీలకుల నియామకం
X

దిశ, పోచమ్మమైదాన్: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక ప్ర‌క్రియ‌కు టీఆర్ఎస్ పార్టీ ప‌రిశీల‌కుల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల పేర్ల‌ను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ ఎన్నిక ప్ర‌క్రియ శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది. వరంగల్ కార్పొరేష‌న్ ఎన్నికల పరిశీలకులగా మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ నియమితులయ్యారు. ఎన్నిక‌ల‌ పరిశీలకులు గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్జ‌ర్వ‌ర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పొరేషన్లకు మేయర్ల‌ను, డిప్యూటీ మేయర్ల‌ను, ఎన్నుకోవాల‌ని సూచించారు.

Advertisement

Next Story