‘ఆపిల్’ ఫేస్ మాస్క్..కేవలం ఎంప్లాయిస్‌కే!

by Harish |
‘ఆపిల్’ ఫేస్ మాస్క్..కేవలం ఎంప్లాయిస్‌కే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపిల్ సంస్థ ఉత్పత్తులు అనగానే ఒక రిచ్ ఫీల్ వస్తుంది. అది ఐఫోన్ అయినా, మాక్‌బుక్ అయినా ఆపిల్ ఉత్పత్తి అంటే చాలు ఆ కిక్కే వేరప్ప. ఇక ఇప్పుడు మాస్క్‌లు కూడా ఆపిల్ తయారుచేస్తోందని తెలిస్తే, దాన్ని పెట్టుకుని షో ఆఫ్ చేయడానికి ఎంతోమంది డబ్బులు చేతబట్టుకుని రెడీగా ఉంటారు. కానీ, మార్కెటింగ్ చేసి, డబ్బు దండుకోవడం మీద కాకుండా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ఆపిల్ సంస్థ శ్రద్ధ వహించింది. అందుకే వారి కోసం మాత్రమే ప్రత్యేకంగా మాస్క్‌లను తయారుచేయించింది. ఐఫోన్, ఐపాడ్‌లను రూపొందించిన అవే ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్ టీమ్‌లే ఈ ఫేస్ మాస్క్‌లను కూడా తయారుచేసినట్లు ఆపిల్ తెలిపింది.

మూడు పొరల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింట్ ఫిల్టరేషన్ సామర్థ్యంతో ఉన్న ఈ ఆపిల్ ఫేస్ మాస్క్‌ను ఐదు సార్లు వరకు ఉతికి పునర్వినియోగించుకోవచ్చు. పైన, కింద పెద్ద పెద్ద కవరింగ్‌లతో, ధరించిన వ్యక్తి చెవులకు సరిగ్గా పట్టేలా సర్దుబాటు చేయగల పట్టీలతో దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీన్ని ధరించినపుడు ముక్కు దగ్గర తెల్లని ఆపిల్ కట్టుకున్నారేమో అన్నట్లుగా కనిపిస్తోంది. దీనితో పాటు క్లియర్‌మాస్క్ అనే ఉత్పత్తిని కూడా ఆపిల్ తయారు చేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఈ సర్జికల్ మాస్క్ నుంచి ధరించిన వారి నోరు, పెదవులు క్లియర్‌గా కనిపిస్తాయి. దీంతో వినికిడి లోపం ఉన్నవారు కమ్యూనికేట్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Next Story