- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరడుగుల దూరమున్నా.. ఐఫోన్‌లో గ్రూప్ సెల్ఫీ సాధ్యమే!
దిశ, వెబ్ డెస్క్ : కరోనాకు ముందు వరకు సమూహంలో ఎలా ఉన్నామో.. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ అలా ఉండాలంటే కష్టమే. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఆరడుగుల దూరం లేకపోయినా.. కనీసం మూడడుగుల దూరమైనా ఉండాల్సిందే. అలాంటప్పుడు గ్రూప్ సెల్ఫీ తీసుకోవడం కష్టమే ? అయితే మిగతా ఫోన్ల సంగతి పక్కనబెడితే ‘ఐ ఫోన్’తో మాత్రం అది కూడా సాధ్యం కానుంది. అదెలా? ఐఫోన్.. అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాను ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తోందా అని ఆలోచిస్తున్నారా? లేదు. ఐ ఫోన్ మేకర్స్ ఇందుకోసం ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ వల్ల సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ సెల్ఫీ దిగినా.. వాటిని తిరిగి దగ్గరకు చేర్చి గ్రూప్ సెల్ఫీగా మార్చుకోవచ్చు. ‘యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్’ అధికారులు.. ఐఫోన్ మేకర్స్ డెవలప్ చేసిన ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్‌పై పేటెంట్ హక్కులు కూడా గ్రాంట్ చేశారు.
సింథటిక్ గ్రూప్ సెల్ఫీస్ : ఇండివిడ్యువల్‌గా సెల్ఫీ దిగినా సరే.. ఆ ఫొటోలన్నింటినీ కలిపి ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో సింగిల్ ఇమేజ్‌గా మార్చొచ్చు. యూజర్ పొజిషన్‌ను కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు సింథటిక్ గ్రూప్ సెల్ఫీగా క్రియేట్ చేసిన తర్వాత.. దాన్ని ఓ స్నేహితునికి పంపించామనుకుందాం. ఆ స్నేహితుడు.. ఇండివిడ్యువల్ అరేంజ్‌మెంట్ గ్రూప్‌లో ఉన్న మాదిరి కాకుండా మరోలా చేయాలనుకున్నా.. అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పేటెంట్ అయితే తీసుకున్నారు కానీ.. దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఐ ఫోన్ వినియోగదారులకు త్వరలోనే ఈ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రావొచ్చు.