- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ డివైజ్ అటాచ్ చేస్తే చాలు.. వస్తువుల నిరంతర పర్యవేక్షణ
దిశ, ఫీచర్స్ : ఆపిల్ కంపెనీ నుంచి ఓ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వస్తుందంటే చాలు. అందరూ దాని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చాలా రోజుల నుంచి ‘ఆపిల్ ఎయిర్ ట్యాగ్స్’ గురించి ఊహాగానాలు వినిపించగా, తాజాగా ఆపిల్ వాటిని విడుదల చేసింది. ఇదో చిన్న డివైజ్ కాగా, దీన్ని బ్యాక్‌ప్యాక్స్, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, కీచెన్స్ వంటి వస్తువులకు ఈజీగా అటాచ్ చేయొచ్చు. దీంతో ‘ఆపిల్ ఫైండ్ మై యాప్’ ఉపయోగించి ఈ వస్తువులను నిరంతరం పర్యవేక్షించొచ్చు.
ఎయిర్‌ట్యాగ్ వృత్తాకారంలో ఉంటుంది. ఈ చిన్న పరికరం ఇన్‌బిల్ట్ స్పీకర్, యాక్సిలెరోమీటర్, బ్లూటూత్, రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఆపిల్ ఎయిర్ ట్యాగ్ ‘ఆపిల్ ఫైండ్ మై’ నెట్‌వర్క్ ద్వారా పని చేస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్ లేదా మరేదైనా పరికరంలో ఫైండ్ మై అప్లికేషన్ ఉపయోగించి, ఎయిర్ ట్యాగ్ యూజర్లు తమ వస్తువులను సులభంగా గుర్తించగలుగుతారు. ఎయిర్‌ట్యాగ్ ట్రాకర్ ఏడాది పొడవునా బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా రూపొందించిన ఎయిర్‌ట్యాగ్‌ను ఐఫోన్‌కు దగ్గరగా తీసుకువస్తే చాలు, ఆటోమేటిక్‌గా అది ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. వినియోగదారులు ఒక వస్తువుకు ఎయిర్‌ట్యాగ్‌ను కేటాయించి, దానికి ‘కీస్’ లేదా ‘జాకెట్’ వంటి డిఫాల్ట్‌తో లేదా కస్టమైజ్డ్ నేమ్ కూడా పెట్టొచ్చు.
ఎయిర్‌ట్యాగ్ సెటప్ చేసిన తర్వాత, ఫైండ్ మై యాప్‌లోని న్యూ ఐటెమ్స్ ట్యాబ్‌లో ఇది కనిపిస్తుంది. మ్యాప్‌లో వినియోగదారులు తమ ప్రొడక్ట్స్ లాస్ట్ లేదా కరెంట్ లోకేషన్ చూడొచ్చు. యూజర్లు తమ వస్తువును కనుగొనమని ‘సిరి’ని కూడా అడగొచ్చు. ఎయిర్ ట్యాగ్ మిస్ ప్లేస్ అయిన ఐటెమ్, సమీపంలో ఉంటే సౌండ్ ప్లే చేస్తుంది. ఆపిల్ ఎయిర్ ట్యాగ్ ధర రూ.3190. ఒకేసారి నాలుగు ఎయిర్ ట్యాగ్స్ కొనుగోలు చేస్తే రూ. 10,900కే అందిస్తుంది. ఆపిల్.కామ్‌లో ఎయిర్ ట్యాగ్స్‌ను బుక్ చేసుకోవచ్చు.