- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతి వివక్ష పెంచుతోందంటూ యాప్‌పై విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: జాతి వివక్ష.. ఈ రెండు పదాల కారణంగా పెద్ద పెద్ద విప్లవాలు జరిగిన రోజులే ఉన్నాయి. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అంటూ పాశ్చాత్య దేశాల్లో విభజనలు చేసి, వివక్ష చూపించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో అల్లర్లు జరిగాయి. సూటిగా చెప్పాలంటే ఇప్పటికీ జరుగుతున్నాయి. మారుతున్న కాలంతో పాటు ఎన్ని మార్పులు వచ్చినా ఈ వివక్షలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. భూమ్మీద వివిధ ఖండాల్లో నివసిస్తున్న వాళ్లు, ఆయా ఖండాల వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా రంగులు, రూపాన్ని కలిగి ఉంటారు. ప్రపంచంలో మనుషులందరూ రూపురేఖల్లో ఒకేలా ఉంటే, ఇలాంటి పరిస్థితి రాకపోయేది. కానీ ఆసియన్లు ఒకలా, యురోపియన్‌లు ఇంకొకలా, ఇండియన్లు వేరొకలా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే..
గ్రేడియంట్ అనే ఒక కొత్త యాప్ విడుదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌ల ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందులో మీ ముఖాన్ని స్కాన్ చేసి, ఒకవేళ మీరు ఆసియన్‌గా పుడితే ఎలా ఉండేవారు? యురోపియన్‌గా పుడితే ఎలా ఉండేవారు? ఇండియన్‌గా పుడితే ఎలా ఉండేవారు? అని చూపిస్తుంది. హాలీవుడ్ సెలెబ్రిటీలు బ్రాడీ జెన్నర్, స్కాట్ డిసిక్, ఇన్‌ఫ్లూయెన్సర్ డేనియల్ కాన్ ఈ యాప్‌ను ప్రమోట్ చేసి ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరోక్షంగా జాతి వివక్షను ఉసిగొల్పుతున్నారని వారిని నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. అయితే ఇది పెయిడ్ ప్రమోషనా? లేదా ఆ సెలెబ్రిటీలు ఆసక్తితో చేశారా? అని తెలియాల్సి ఉంది. ఏదీ ఏమైనా ఇలా విప్లవాలు తీసుకొచ్చి, వివాదాలు మోసుకొచ్చే జాతి వివక్ష అనే అంశం జోలికి వెళ్లకపోవడమే మంచిది.