అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌కు గ్లోబల్ అక్రెడిటేషన్

by  |
అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌కు గ్లోబల్ అక్రెడిటేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో మొట్టమొదటి ప్రోటాన్ థెరపీ హాస్పిటల్ అయిన అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్(ఏపీసీసీ) హెల్త్‌కేర్ అక్రిడిటేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న జాయింట్ కమిషన్ ఇంటర్‌నేషనల్(జేసీఐ) నుంచి అక్రిడిటేషన్‌ను అందుకున్నట్టు శుక్రవారం ప్రకటించింది. భారత్‌లో అడ్వాన్స్ క్యాన్సర్‌లకు ప్రత్యేకంగా అంకితమైన ఏపీసీసీ ఈ గుర్తింపును అందుకున్న మొట్టమొదటి కేంద్రం. అంతేకాకుండా, జేసీఐ గుర్తింపు పొందిన అపోలో గ్రూప్ హాస్పిటల్స్‌లో 8వ హాస్పిటల్. 2019లో ప్రారంభమైన అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ ప్రోటాన్ థెరపీ, క్యాన్సర్ కేర్ మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన క్యాన్సర్ కేంద్రంగా ఆవిర్భవించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, సంరక్షణ, భద్రతను అందించడం ద్వారా హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో జేసీఐ గుర్తింపుతో ప్రతిష్టాత్మకతను దక్కించుకుంది.

దీనిపై స్పందించిన అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి.. “అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్(ఏపీసీసీ)కి ప్రత్యేక గౌరవం లభించినందుకు సంతోషిస్తున్నాను. ఇది జేసీఐ చేత గుర్తింపు పొందిన భారత్‌లోని మొట్టమొదటి అధునాతన క్యాన్సర్ కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది” అని వర్చువల్ విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతా రెడ్డి మాట్లాడుతూ “ఏడాది క్రితమే దక్షిణ ఆసియా, మిడిల్ ఈస్ట్‌లో మొట్టమొదటి ప్రోటాన్ థెరపీని చెన్నైలోని అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ (ఏపీసీసీ)లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన రేడియేషన్ థెరపీని తీసుకురావడం ద్వారా 35 లస్ఖల మందికి ప్రయోజనం ఉంటుంది” అని చెప్పారు.


Next Story

Most Viewed